![]() |
![]() |

గత ఏడాది సంక్రాంతికి వినోదాలు పంచిన చిత్రం 'ఎఫ్2'. ఇద్దరు తోడల్లుళ్ళ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌తో తెరకెక్కిన ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి త్వరలోనే సీక్వెల్ రానుంది. 'ఎఫ్3' పేరుతో ఈ కొనసాగింపు తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా.. డిసెంబర్ 14 నుంచి సెట్స్ పైకి వెళుతుందట. చకచకా చిత్రీకరణ జరిపి 2021 వేసవిలో జనం ముందుకు తీసుకువచ్చేందుకు అనిల్ ప్లాన్ చేస్తున్నారట.
'ఎఫ్2'లో ప్రధాన పాత్రల్లో నటించిన వెంకీ, వరుణ్, తమన్నా, మెహరీన్.. ఈ సీక్వెల్ లోనూ సందడి చేయనున్నారు. అలాగే 'ఎఫ్2'ని నిర్మించిన దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుండగా.. దేవిశ్రీ ప్రసాదే బాణీలు అందించనున్నారు. మరి.. 'ఎఫ్2' లాగే 'ఎఫ్3' కూడా సక్సెస్‌ఫుల్ వెంచర్ అవుతుందేమో చూడాలి.
![]() |
![]() |