![]() |
![]() |

సూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నైలోని తన ఇంట్లో ఫ్యామిలీతో కలిసి దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఆయన చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ షేర్ చేసిన పిక్చర్లలో రజనీ టపాసులు, కాకరపువ్వొత్తులు కాలుస్తూ యువకుడిలా మారిపోయి కనిపించారు. రజనీ, ఆయన భార్య లత, కుమార్తె సౌందర్య, అల్లుడు విశాఖన్, మనవడు వేద్ కృష్ణ దీపావళి ప్రత్యేక దుస్తులు ధరించి ఉత్సాహంగా క్రాకర్స్ కాలుస్తూ కనిపించారు.
తమ కుటుంబం దీపావళి సంబరాలకు సంబంధించిన కొన్ని పిక్చర్లను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన సౌందర్య రజనీకాంత్, "మా కుటుంబం తరపున ప్రతిఒక్కరికీ చాలా సురక్షితమైన దీపావళి శుభాకాంక్షలు.. ప్రేమ, సానుకూలతను వ్యాప్తి చేయండి .. సర్వశక్తిమంతుడిని విశ్వసించి లొంగిపోండి !!!! దేవతలు, గురువులు ఎల్లప్పుడూ మనలను ఆశీర్వదిస్తారు. #StaySafe #BeResponsible #GoCorona (sic)." అని రాసుకొచ్చారు.
ఆమె పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే ఇంటర్నెట్‌లో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. అలాగే తన ఇంటి నుంచి అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న సూపర్‌స్టార్ వీడియో కూడా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.



![]() |
![]() |