![]() |
![]() |

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరోమారు జట్టుకడుతున్న సంగతి తెలిసిందే. 'అరవింద సమేత' వంటి విజయవంతమైన చిత్రం తరువాత రాబోతున్న ఈ క్రేజీ వెంచర్.. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. యన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ బాణీలు అందించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ప్రారంభోత్సవాన్ని ఫిబ్రవరిలోనూ.. రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి షురూ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఈలోగా 'ఆర్ ఆర్ ఆర్'కి సంబంధించిన తన పార్ట్ కంప్లీట్ చేసేందుకు తారక్ సన్నాహాలు చేసుకుంటున్నారట.
అంతేకాదు.. 'అరవింద సమేత' తరహాలోనే తారక్ - త్రివిక్రమ్ - తమన్ ద్వితీయ ప్రయత్నం కూడా విజయ దశమికే వెండితెరపై వినోదాలు పంచనుందట.
![]() |
![]() |