![]() |
![]() |

సాహితీవేత్త, హీరో వరుణ్ సందేశ్ తాతయ్య జీడిగుంట రామచంద్రమూర్తి కొవిడ్ 19తో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయనను కరోనా మహమ్మారి బలితీసుకుంది. చికిత్స పొందుతూ, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కథారచయితగా జీడిగుంట రామచంద్రమూర్తి సాహితీ లోకంలో లబ్ధప్రతిష్ఠులు. రేడియోలో న్యూస్ రీడర్గా ఆయన తెలుగు శ్రోతలకు సుపరిచితులు.
ఆయనకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు విజయసారథి అమెరికాలో చాలా కాలం ఉన్నారు. ఆయన కుమారుడే వరుణ్ సందేశ్. కుమారుడి కోసం విజయసారథి కుటుంబం హైదరాబాద్కు వచ్చేసింది. రామచంద్రమూర్తి రెండో కుమారుడు శ్రీధర్ టీవీ నటుడు. మనవరాలు వీణా సాహితి అలా మొదలైంది సినిమాతో గేయ రచయిత్రిగా పరిచయమయ్యారు. రామచంద్రమూర్తి మృతిపట్ల ఇటు సాహితీ, అటు సినీ రంగాలకు చెందిన వారు సంతాపం వ్యక్తం చేశారు.
![]() |
![]() |