![]() |
![]() |

నారా రోహిత్ కథానాయకుడిగా పరిచయమైన 'బాణం' చిత్రంతోనే దర్శకుడిగా తొలి అడుగేశారు చైతన్య దంతలూరి. మొదటి సినిమాతోనే అభిరుచి గల దర్శకుడు అనిపించుకున్నారు. అయితే కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అందుకోలేకపోయారు. ఆ తరువాత బ్రహ్మానందం తనయుడు గౌతమ్ తో 'బసంతి' తీశారు. ఆ సినిమా కూడా కాసుల వర్షం కురిపించలేకపోయింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తరువాత మరోమారు మెగాఫోన్ పట్టనున్నారు చైతన్య.
ఈ సారి వైవిధ్యభరిత చిత్రాలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు శ్రీవిష్ణుని తన సినిమాకి కథానాయకుడిగా ఎంచుకున్నారని సమాచారం. త్వరలోనే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. 'బాణం', 'బసంతి' చిత్రాలతో ఆశించిన విజయాలు అందుకోలేకపోయిన చైతన్య దంతలూరి.. శ్రీ విష్ణు కాంబినేషన్ ఫిల్మ్ తో అయినా ఫస్ట్ కమర్షియల్ హిట్ అందుకుంటారేమో చూడాలి.
![]() |
![]() |