![]() |
![]() |

కథానాయకుడిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ది 17 ఏళ్ళ నట ప్రస్థానం. ఈ ప్రయాణంలో ఇప్పటివరకు స్ట్రయిట్ పిక్చర్స్ తోనే సందడి చేశారు బన్నీ. 'గంగోత్రి' నుంచి 'అల వైకుంఠపురములో' వరకు ఇదే బాణీ. నిర్మాణంలో ఉన్న 'పుష్ప', ఆపై రానున్న కొరటాల శివ కాంబినేషన్ మూవీ కూడా ఆయా దర్శకులు తయారుచేసుకున్న కథలతోనే తెరకెక్కనున్నాయి.
అయితే ఆ తరువాత మాత్రం బన్నీ ఓ రీమేక్ చేయబోతున్నారట. ఆ సినిమా మరేదో కాదు.. హిందీలో విజయం సాధించిన 'సోనూ కే టీటూ కీ స్వీటీ'. వాస్తవానికి 'అల వైకుంఠపురములో' కంటే ముందు బన్నీ, త్రివిక్రమ్ ఈ సినిమానే రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. కొన్ని కారణాల వల్ల అది వర్కవుట్ కాలేదు. కట్ చేస్తే.. మళ్ళీ ఇప్పుడు ఈ రీమేక్ పై దృష్టి సారించారట బన్నీ. అంతేకాదు.. ఓ స్టార్ డైరెక్టర్ కెప్టెన్సీలోనే ఈ చిత్రాన్ని చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. త్వరలోనే ఈ రీమేక్ కి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. మరి.. ఫస్ట్ రీమేక్ తో బన్నీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.
![]() |
![]() |