![]() |
![]() |

ఓ అందమైన ప్రేమకథగా ‘రాధే శ్యామ్’ సినిమా రూపొందుతోందని ప్రభాస్ ఇటలీ మీడియాతో స్పష్టం చేశారు. ఇందులో ఫైట్లు ఉన్నాయి కానీ పెద్దగా ఉండవని ఆయన వెల్లడించారు. ఫైట్స్ లెంగ్త్ తక్కువే అట! సినిమాలో లవ్ స్టోరీ మీదే ఎక్కువ కాన్సన్‌ట్రేట్ చేశారట. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇటలీలో ఓ షెడ్యూల్ ముగించుకున్న ‘రాధే శ్యామ్’ యూనిట్ హైదరాబాద్ వచ్చింది. ఆల్రెడీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ షూటింగ్‌లో పూజ పాల్గొంటోంది.
‘రాధే శ్యామ్’లో ప్రేమకథ చాలా అందంగా ఉంటుందని యూనిట్‌లో ఏ ఒక్కరినీ కదిలించినా చెబుతున్నారు. ఇందులో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు జంటగా ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే కనిపించనున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్‌లో వీళ్లిద్దరి జంట ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసింది. నేపథ్య సంగీతంలో జస్టిన్ ప్రభాకరన్ స్వరపరిచిన పాట సైతం ఆకట్టుకుంది.
ఆల్రెడీ యూరప్‌లో ఫైట్ తీశారు. లవ్ సీన్లు సైతం చాలా వరకూ కంప్లీట్ చేశారు. త్వరలో హైదరాబాద్‌లో బ్యాలెన్స్ పార్ట్ ఫినిష్ చేస్తార్ట.
![]() |
![]() |