![]() |
![]() |

తెలుగులో నాని కథానాయకుడిగా నటించిన 'పిల్ల జమిందార్' చిత్రంతో దర్శకుడు జి. అశోక్ విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'భాగమతి'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం 'భాగమతి' హిందీ రీమేక్ 'దుర్గావతి' నిర్మాణానంతర కార్యక్రమాల్లో అశోక్ బిజీగా ఉన్నారు. ఆ సినిమా విడుదల తర్వాత హిందీలోనే మరో సినిమా చేయనున్నాడని సమాచారం.
'బాహుబలి', 'టెంపర్', 'ఊపిరి' చిత్రాలలో ప్రత్యేక గీతాల్లో సందడి చేసిన నోరా ఫతేహి, హిందీ కథానాయక నుష్రత్ భరూచా ప్రధాన పాత్రల్లో ఒక మూకీ సినిమా చేయడానికి అశోక్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. 'ఉఫ్...' టైటిల్ కూడా ఖరారు చేశారట. వచ్చే ఏడాది జనవరిలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్తారని, ప్రముఖ దర్శక నిర్మాతల లవ్ రంజన్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారని సమాచారం.
![]() |
![]() |