![]() |
![]() |

కమర్షియల్ కథలకు సామాజిక సందేశాన్ని జోడించి ప్రేక్షకులు మెచ్చే చిత్రాలు తీసిన కొరటాల శివ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా గతంలో ఓ సినిమా ప్రారంభమైంది. కానీ, కథ విషయంలో పూర్తి సంతృప్తిగా లేక కొరటాల సినిమాను పక్కన పెట్టేసాడు. అప్పటినుండి ఇప్పటి వరకు వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ 'ఆచార్య' సినిమా తీస్తున్నారు. ఇందులో చిరు తనయుడు చరణ్ ఒక పాత్ర చేస్తున్నారు. అయితే... ఈ సినిమా కాకుండా కొరటాల, చరణ్ కలయికలో మరో సినిమా రానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇటీవల రామ్ చరణ్ ను కలిసిన కొరటాల ఒక కథ చెప్పాడట. అది హీరోకి విపరీతంగా నచ్చిందని, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని తెలిసింది. కొరటాల సన్నిహితుడు వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఆచార్య తర్వాత అల్లు అర్జున్ కథానాయకుడిగా ఓ సినిమా చేయడానికి కొరటాల కమిట్ అయ్యాడు. అది పూర్తయిన తర్వాత రామ్ చరణ్ సినిమా ఉంటుంది. 2023 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |