![]() |
![]() |

బాలకృష్ణ దర్శకత్వంలో ప్రారంభమై నటి సౌందర్య అకాల మరణంతో అర్ధంతరంగా ఆగిపోయిన 'నర్తనశాల' సినిమా 17 నిమిషాల నిడివి సన్నివేశాలు అక్టోబర్ 24న శ్రేయాస్ ఈటీలో విడుదల కానున్న విషయంలో తెలిసిందే. అర్జునునిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య నటించిన ఈ చిత్రంలో భీముని పాత్రను రియల్ స్టార్ శ్రీహరి పోషించారు. ఆయనకు సంబంధించిన క్యారెక్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోతున్న సందర్భంగా ఆయన తనయుడు, 'రాజ్‌దూత్' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మేఘాంశ్ శ్రీహరి స్పందించాడు. చాలా కాలం తర్వాత తన తండ్రిని తెరమీద చూడబోతున్నందుకు ఉద్వేగంగా ఉందన్నాడు.
"చాలా ఏళ్ల తర్వాత నాన్నగారిని మళ్లీ స్క్రీన్ మీద చూడబోతున్నాం. నాన్నగారి అభిమానులతో పాటు మా ఫ్యామిలీ కూడా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాం. నాన్నగారి క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ అవబోతోంది. వియ్ ఆర్ రియల్లీ ఎగ్జయిటెడ్. నా ఫీలింగ్స్‌ను కూడా ఎక్స్‌ప్రెస్ చెయ్యలేను. అతి త్వరలో బాలయ్యగారి సినిమా 'నర్తనశాల' విడుదలవబోతోంది. అందులో నాన్నగారు భీమ క్యారెక్టర్ చేశారు. వి ఆర్ ఆల్ రియల్లీ ఎగ్జయిటెడ్." అని చెప్పాడు మేఘాంశ్.
ప్రేక్షకుల హృదయాల్లో రియల్ స్టార్‌గా చెరగని ముద్ర వేసిన శ్రీహరి అనారోగ్యానికి గురై ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ 2013 అక్టోబర్‌లో అర్ధంతరంగా కన్నుమూశారు. ఆయన వారసునిగా మేఘాంశ్ హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చాడు.
![]() |
![]() |