![]() |
![]() |

తమిళ కథానాయకుడు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కార్తీకి కొడుకు పుట్టాడు. ఆయన సతీమణి రంజని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ దంపతులకు రెండో సంతానం ఇది. తొలి సంతానంలో కుమార్తె కలిగిన సంగతి తెలిసిందే. అమ్మాయికి ఉమయాల్ అని పేరు పెట్టారు. అబ్బాయికి ఇంకా పేరు పెట్టలేదు. వారసుడు వచ్చిన సంగతిని సామాజిక మాధ్యమాలలో కార్తి తెలియజేశారు.
"డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ... మాకు అబ్బాయి పుట్టాడు. చిన్నారికి మీ ఆశీస్సులు కావాలి. దేవుడికి కృతజ్ఞతలు" అని కార్తి పేర్కొన్నారు.
కార్తీ సోదరుడు, ప్రముఖ కథానాయకుడు సూర్య-జ్యోతిక దంపతులకు సైతం తొలుత అమ్మాయి, ఆ తర్వాత అబ్బాయి పుట్టారు. సేమ్ సెంటిమెంట్ రిపీట్ అయింది అన్న మాట.
సినిమాల విషయానికి వస్తే... ఇటీవల 'సుల్తాన్' చిత్రీకరణను కార్తీ పూర్తి చేశారు. అందులో రష్మిక కథానాయిక. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ ఫాంటసీ ఫిలిం 'పొన్నియన్ సెల్వన్' చిత్రీకరణలో త్వరలో పాల్గొననున్నారు.
![]() |
![]() |