![]() |
![]() |

హైదరాబాద్ సిటీలో కురుస్తున్న వర్షాలు సినిమా షూటింగులకు ఆటంకాలు కలిగిస్తున్నాయి. వర్షం తమ చిత్ర బృందంతో దోబూచులాట ఆడుతోందని ఏఎన్ఆర్ మనవడు, నాగార్జున మేనల్లుడు సుశాంత్ అంటున్నాడు. అతడు హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'. ప్రస్తుతం భాగ్యనగరంలో చిత్రీకరణ చేస్తున్నారు. వర్షం వచ్చి పోతూ ఉండడంతో చిత్రీకరణకు ఆటంకం ఏర్పడుతోంది.
షూటింగుకు బ్రేక్ వచ్చినప్పుడు హీరోయిన్ మీనాక్షి చౌదరి, ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శితో కలిసి సుశాంత్ ఇలా ఫోటోలు, వీడియో తీసుకున్నారు. బైక్ నేపథ్యంలో సరికొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
వర్షాల వల్ల ఎందుకొచ్చిన ఇబ్బంది అని అవుట్ డోర్ లో ప్లాన్ చేసిన రవితేజ 'క్రాక్' చిత్రీకరణను స్టూడియోకి మార్చారు. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో వర్షం నేపథ్యంలో సన్నివేశాలు ఉండటంతో వాటిని చిత్రీకరిస్తున్నారు.
![]() |
![]() |