![]() |
![]() |

సూపర్‌స్టార్ మహేష్‌బాబు కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అతడు', 'ఖలేజా' చిత్రాలు వచ్చాయి. 'అతడు' కల్ట్ క్లాసిక్ అవ్వగా... మహేష్ బాబు కామెడీ కూడా బాగా చేయగలడని, అతడిలో కామెడీ యాంగిల్ ని 'ఖలేజా' చూపించింది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ముచ్చటగా మూడో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని మహేష్ స్వయంగా చెప్పాడు.
'ఖలేజా' విడుదలై నేటికి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మహేష్ బాబు "ఖలేజా వచ్చి పదేళ్లు అయింది. నటుడిగా నన్ను కొత్తగా ఆవిష్కరించిన సినిమా. ఎప్పటికీ నాకు ఈ సినిమా ప్రత్యేకం. నాకు మంచి స్నేహితుడు, బ్రిలియంట్ దర్శకుడు త్రివిక్రమ్ కి థాంక్స్" అని ట్వీట్ చేశారు. అంతటితో ఆగలేదు. "త్రివిక్రమ్... మన తదుపరి సినిమా కోసం ఎదురు చూస్తున్నా. అతి త్వరలో" అని మహేష్ అన్నారు. ఇద్దరి కలయికలో మూడో సినిమా గురించి హింట్ ఇచ్చారు. బహుశా... ఎన్టీఆర్-త్రివిక్రమ్, మహేష్-పరశురామ్ సినిమాలు అయ్యాక మహేష్-త్రివిక్రమ్ సినిమా ఉంటుందేమో!
![]() |
![]() |