![]() |
![]() |

ఒకటిన్నర దశాబ్ద కాలంగా ప్రేక్షకులను తన సౌందర్యంతోనూ, తన నటనా ప్రతిభాతోనూ అలరిస్తూ వస్తోన్న కాజల్ అగర్వాల్ మంగళవారం తన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ తన పెళ్లి ప్రకటన చేసింది. అక్టోబర్ 30న ముంబైలో గౌతమ్ కిచ్లు అనే బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లాడనున్నట్లు తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తెలియజేసింది. ఒక చిన్న, ప్రైవేట్ వేడుకలా దాన్ని జరుపుకుంటున్నామనీ, ఇద్దరి కుటుంబసభ్యులు మాత్రమే ఇందులో పాల్గొంటారనీ ఆమె చెప్పింది.

కాజల్ పెళ్లి చేసుకుంటే.. ఇక సినిమాల్లో కనిపించదమేమోనని ఆందోళన చెందే అభిమానులకు ఊరటనిచ్చే తీపి కబురు కూడా చెప్పింది కాజల్. "నేనెక్కువగా ఆనందించే, నా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే పనిని కొనసాగిస్తాను, కాకపోతే ప్రయోజనాత్మక, అర్థవంతమైన సినిమాలు చేస్తాను." అని ఆమె వెల్లడించింది.
.jpg)
ఈ మధ్యలో ఆమె తన స్నేహితులతో బ్యాచిలరెట్ పార్టీ చేసుకుంది. వాటిని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసుకుంది. అలాగే కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ సైతం తన సోషల్ మీడియా అకౌంట్లో వాటిని షేర్ చేసింది. వెంటనే ఇవి ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. ఈ పార్టీలో బ్లాక్ డ్రస్‌లో కాజల్ స్టన్నింగ్ లుక్‌తో అదరగొడుతోంది. 'బ్రైడ్ టు బి' అనే ట్యాగ్ ఉన్న సాష్ వేసుకొని హుషారుగా ఫ్రెండ్స్‌తో అల్లరి చేస్తూ కనిపిస్తోంది.
.jpg)
![]() |
![]() |