![]() |
![]() |

దర్శకుడు అనురాగ్ కశ్యప్ మీద లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలు చేసిన పాయల్ ఘోష్, ఆ క్రమంలో హీరోయిన్ రిచా చద్దా, హ్యూమా ఖురేషీలను టార్గెట్ చేశారు. అనురాగ్-పాయల్ గొడవలో తనను లాగడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసిన రిచా చద్దా, పాయల్ మీద రూ. 1.1 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.
పరువు నష్టం దావా కేసు విచారణకు వచ్చినప్పుడు పాయల్ గానీ, ఆమె తరపు లాయర్ గానీ కోర్టుకు హాజరు కాలేదు. రిచా చద్దా లాయర్ సవీనా బేడీ ఈ విషయం తెలిపారు. సెప్టెంబర్ 29న ఒకసారి, అక్టోబర్ 3న మరోసారి పాయల్ కి లీగల్ నోటీసులు ఇచ్చారట. వాట్సాప్ లో పాయల్ నోటీసులు స్వీకరించినప్పటికీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. బుధవారం మళ్ళీ ఈ కేసు విచారణకు రానుంది. మరి, పాయల్ హాజరు అవుతారో లేదో చూడాలి. రిచా మీద కామెంట్లు చేసిన కమల్ రషీద్ ఖాన్ నోటీసులు స్వీకరించడానికి సుముఖత వ్యక్తం చేయలేదట. దాంతో అతడికి ఈమెయిల్ చేశారట.
![]() |
![]() |