![]() |
![]() |

ఎటువంటి అంచనాలు లేకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన 'కె.జి.యఫ్' సినిమా భారీ విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో కన్నడ హీరో యష్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. మాస్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఆ సినిమాను మెప్పించింది. దానికి సీక్వెల్ గా 'కె.జి.యఫ్-2' రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కొత్త అప్ డేట్ వచ్చింది.
'కె.జి.యఫ్-2' చిత్రీకరణలో గురువారం నుండి రాక్ స్టార్ యష్ ఇందులో పాల్గొంటారని తెలిసింది. ఆయనతో పాటు సంజయ్ దత్ కూడా చిత్రీకరణ చేయవచ్చని సమాచారం. లంగ్ క్యాన్సర్ బారిన పడిన ఆయన చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తన వల్ల సినిమా ఆలస్యం కాకూడదని షూటింగ్ చేయడానికి ముందుకొస్తున్నారట. అక్షయ్ కుమార్ సినిమా షూటింగులో కూడా సంజయ్ దత్ చేస్తారని సమాచారం. అక్టోబర్ నెలాఖరుకి 'కె.జి.యఫ్-2' చిత్రీకరణ మొత్తం పూర్తి చేసేలా ప్లాన్ చేశారట. ఈ ఏడాది సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట.
![]() |
![]() |