![]() |
![]() |

తమిళ కథానాయకుడు కార్తీ ప్రస్తుతం అత్తగారి ఊరిలో ఉన్నారు. తమిళనాడులోని ఈరోడ్ లోని గొండపాళయంలో భార్య రజినీకి తోడుగా ఉంటున్నారు. త్వరలో ఆమె పండంటి బిడ్డకు జన్మని ఇవ్వనున్నారని తెలిసింది. రజనీతో కార్తీ వివాహం 2013లో జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉమయాల్ ఉన్నారు. ఇప్పుడు రెండోసారి కార్తి తండ్రి కానున్నారు. డెలివరీ సమయానికి భార్య దగ్గర ఉండేలా చిత్రీకరణలు అన్నిటిని రద్దు చేసుకున్నట్లు సమాచారం.
'ఆవారా'తో తెలుగు ప్రేక్షకులకు కార్తీ దగ్గరయ్యాడు. సూర్య తమ్ముడిగా తరవాత అతడు నటించిన కొన్ని సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనూ ఘన విజయాలు సాధించడంతో తెలుగు హీరో గానే అతడిని ప్రేక్షకులు చూస్తున్నారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్, బతుకే రాజ్ దర్శకత్వంలో సుల్తాన్, మిత్రన్ దర్శకత్వంలో ఒక సినిమా, ముత్తయ్య దర్శకత్వంలో మరో సినిమా కార్తీ చేస్తున్నారు.
![]() |
![]() |