![]() |
![]() |

ఇటీవల తమిళ సీనియర్ నటుడు, రాజకీయవేత్త కెప్టెన్ విజయకాంత్ కొవిడ్-19 బారినపడినట్లు ధ్రువీకరణ జరిగిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు భార్య ప్రేమలతకు కూడా ఆ వైరస్ సోకింది. దాంతో ఇటీవల ఇద్దరూ హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం మెరుగవడంతో ఇద్దరూ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేశారు. కాగా, విజయకాంత్‌కు మళ్లీ అస్వస్థత కలగడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారనేది తాజా సమాచారం.
"డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాక 15 రోజులకు రెండోసారి పరీక్షల కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు. రెండు రోజుల్లో ఆయన తిరిగి ఇంటికి వస్తారని ఆశిస్తున్నాం." అని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. విజయకాంత్ ఆరోగ్య స్థితి బాగానే ఉందనీ, వదంతులను నమ్మవద్దనీ ఆ వర్గాలు చెప్పాయి.
కాగా విజయకాంత్ తనయుడు విజయ్ ప్రభాకరన్ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా తండ్రి ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు. "దయచేసి రూమర్లను వ్యాప్తి చెయ్యకండి. ఇది కేవలం నార్మల్ చెకప్. మాకు కాస్త ప్రైవసీ ఇవ్వండి. నాన్నకు ఏమైందంటూ ప్రతి ఒక్కరూ ఎందుకు కాల్ చేసి అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కెప్టెన్ బాగానే ఉన్నారు. రేపటికల్లా ఇంటికి వచ్చేస్తారు." అని ఆయన తెలిపారు.
![]() |
![]() |