![]() |
![]() |

'రంగస్థలం' సినిమాలో పల్లెటూరి ప్రెసిడెంట్ పాత్రలో ఒకప్పటి కథానాయకుడు జగపతిబాబు విలనిజం అద్భుతంగా పండించారు. రామ్ చరణ్, ఆయనకి మధ్య సన్నివేశాలకు అద్భుత స్పందన లభించింది. ఇప్పుడు మరో మెగా హీరో చిత్రంలో జగపతిబాబు నటిస్తున్నారు. ఇది రాజకీయ నేపథ్య చిత్రంలో కావడం విశేషమే!
సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా దేవకట్టా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గ్రామ రాజకీయాలు, పల్లెటూరి నేపథ్యంలో 'రంగస్థలం' చిత్రాన్ని తెరకెక్కిస్తే... రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ సినిమా రూపొందనుంది. ఇందులో కీలక పాత్ర జగపతి బాబు ను సంప్రదించారనీ, అందులో నటించడానికి ఆయన సమ్మతించారనీ సమాచారం. ఈనెల 19 నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. సాయిధరమ్ తేజ్ సరసన నివేదా పేతురాజ్ కథానాయికగా ఈ సినిమాలో నటించనుంది.
![]() |
![]() |