![]() |
![]() |

ప్రేమలో పడటం ఒక మాయాజాలం అయితే, మనం ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం చాలా ఆనందాన్నిస్తుంది. అదే గనుక ప్రేమించిన వ్యక్తి బెస్ట్ ఫ్రెండ్ కూడా అయితే, మనల్ని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి అయితే ఇంకెంత ఆనందాన్నిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఆనందాన్నే అనుభవిస్తోన్న జంట.. నాగచైతన్య, సమంత! ప్రేమంటో ఏమిటో వాళ్లను చూసి నేర్చుకోవాలన్నంత ప్రేమైక జీవితాన్ని వారు ఆస్వాదిస్తున్నారనేది నిజం.
చైతూ, సామ్ ప్రేమకథ ఒక జానపద కథ కంటే తక్కువేమీ కాదు. ఎందుకంటే ఇద్దరివీ పూర్తిగా భిన్న మనస్తత్వాలు. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయనే దానికి వారు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సమంత ఎక్స్‌ట్రావర్ట్. బిందాస్‌గా ఉంటుంది. మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇందుకు చైతూ పూర్తి భిన్నం. అతను ఇంట్రావర్ట్. పర్సనల్ లైఫ్‌ను బయట పెట్టుకోవడానికి ఇష్టపడడు. సోషల్ మీడియాలో అవసరమైతే తప్ప కనిపించడు. అలాంటి ఆ ఇద్దరూ 2009లో 'ఏ మాయ చేశావే' సినిమా సెట్స్‌పై తొలిసారి కలుసుకున్నారు. స్నేహితులయ్యారు. కొంత కాలానికి ప్రేమలో పడ్డారు. 2017 అక్టోబర్ 6న దంపతులయ్యారు. మొదట సంప్రదాయ హిందూ పద్ధతిలో, తర్వాత క్రైస్తవ సంప్రదాయానుసారం పెళ్లి చేసుకున్నారు.
నేటికి వారి పెళ్లయి మూడేళ్లు. ఇప్పటికీ ప్రేమలోని మాధుర్యాన్ని ఆ ఇద్దరూ అమితంగా ఆస్వాదిస్తూనే ఉన్నారు. జంటగా ఉన్నప్పుడు వాళ్లను చూస్తే.. వారి ముఖాల్లో కనిపించే వెలుగు ఆ విషయం మనకు తెలియజేస్తుంది. మనం కూడా వారితో పిచ్చి ప్రేమలో పడిపోతాం. తన జీవితంలో ప్రేమను నింపిన చైతూకు పెళ్లి రోజు సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా విషెస్ తెలియజేసింది సామ్. రానా పెళ్లికి దిగిన తమ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆ ఇద్దరూ ఎప్పటిలా స్టన్నింగ్ అనిపిస్తున్నారు. "నువ్వు నా వాడివి, నేను నీ దీన్ని. మన దగ్గరకు ఏ తలుపు వచ్చినా, ఇద్దరం కలిసే దాన్ని తెరుద్దాం. హ్యాపీ యానివర్సరీ హజ్బెండ్ @chayakkineni” అంటూ అందంగా తన భర్తకు విషెస్ తెలిపింది సమంత.

కాగా ఆ ఇద్దరి మూడో పెళ్లిరోజు సందర్భంగా రానా, అఖిల్, ఉపాసన, మంచు లక్ష్మి, ప్రియమణి, వెన్నెల కిశోర్, రాశీ ఖన్నా, కృతి ఖర్బందా, ప్రగ్యా జైస్వాల్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
![]() |
![]() |