![]() |
![]() |

అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లు అనే బిజినెస్‌మ్యాన్‌ను ముంబైలో పెళ్లి చేసుకోబోతున్నానని టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రకటించగానే ఆమె ఆరాధకుల గుండెలు పగిలాయి. అయితే ఆమె అభిమానులు ఎవరీ గౌతమ్ అంటూ ఆరాలు తీయడం ప్రారంభించారు. అతని పూర్తి పేరు గౌతమ్ కిచ్లు. 'డిసెర్న్ లివింగ్' అనే కంపెనీకి యజమాని. అది.. ఇంటీరియల్ డిజైన్, హోమ్ డెకర్ సొల్యూషన్స్‌కు సంబంధించిన ఇ-కామర్స్ కంపెనీ.
కాజల్, గౌతమ్ అనుబంధం గురించి బయటి ప్రపంచానికి ఎక్కువగా తెలీదు. ఆ ఇద్దరిదీ అరేంజ్డ్-లవ్ మ్యారేజ్‌గా ప్రచారంలో ఉంది. ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ విద్యార్థి అయిన గౌతమ్.. మసాచుసెట్స్‌లోని టఫ్ట్స్ యూనివర్సిటీలోనూ, తర్వాత బిజినెస్ స్కూల్ ఇన్సియాడ్‌లోనూ చదువుకున్నాడు. 'డిసెర్న్ లివింగ్'ను ప్రారంభించక ముందు 'ఫ్యాబ్ ఫర్నిష్'కు వైస్ ప్రెసిడెంట్‌గా, లైఫ్‌స్టైల్ బ్రాండ్ 'ది ఎలిఫెంట్ కంపెనీ'కి సీఈఓగా పనిచేశాడు.

కాగా లాక్‌డౌన్ తర్వాత ముంబైలో జరగనున్న మొదటి సెలబ్రిటీ పెళ్లి కాజల్‌దే కానుండటం గమనార్హం. కరోనా మహమ్మారి కారణంగా అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో కాజల్, గౌతమ్ వివాహం జరగనున్నది. ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది సన్నిహితులే ఈ పెళ్లికి హాజరవనున్నారు.
.jpg)
![]() |
![]() |