![]() |
![]() |

బాలీవుడ్ సినిమాల దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని, తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని నటి పాయల్ ఘోష్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వాటిని అనురాగ్ కొట్టిపడేశారు. అంతేకాదు... అత్యాచారం చేయడానికి ప్రయత్నించానని పాయల్ చెప్పిన సమయంలో తాను శ్రీలంకలో ఉన్నానని అనురాగ్ కశ్యప్ కోర్టుకు ఆధారాలను కూడా సమర్పించాడు. ఈ కేసును పక్కన పెడితే...
అనురాగ్ కశ్యప్ మీద ఆరోపణలు చేసినప్పుడు మరో నాయిక రిచా చద్దా ప్రస్తావనను పాయల్ ఘోష్ తీసుకొచ్చారు. దర్శకుడు లైంగిక వాంఛలు తీర్చినందుకు బదులుగా ఆమెకు అవకాశాలు వచ్చాయని పేర్కొన్నారు. పాయల్ ఆరోపణలలో తనను లాగడం మీద రిచా చద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరువుకు భంగం వాటిల్లే విధంగా మాట్లాడినందుకు కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తనకు రూ. 1.1 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం ముంబై హై కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
![]() |
![]() |