![]() |
![]() |
.jpg)
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. భారతీయ సినీ ప్రేమికులకూ ఇది శుభవార్తే అని చెప్పాలి. 'బాహుబలి 2' తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రుదిరం'. ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో సినిమాపై తెలుగునాట భారీ అంచనాలు నెలకొన్నాయి. విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. 'బాహుబలి' తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల్లోనూ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆరు నెలల విరామం తర్వాత సోమవారం 'ఆర్ఆర్ఆర్' సినిమా చిత్రీకరణ పునః ప్రారంభమైంది. హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అంతకంటే శుభవార్త ఏమిటంటే... ఈ నెల 22న ఎన్టీఆర్ టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఎన్టీఆర్ పుట్టినరోజుకి టీజర్ విడుదల చేస్తారని నందమూరి అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూశారు. కనీసం ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేదు. అప్పుడు అభిమానులు 'ఆర్ఆర్ఆర్' బృందంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజర్ ఎప్పుడు విడుదల చేసిన అభిమానులకు పండగ ఎలా ఉంటుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఇప్పుడు విజయదశమి పండక్కి కొన్ని గంటల ముందే టీజర్ విడుదల చేయనున్నట్లు చెప్పి ఆల్రెడీ పండగ వాతావరణాన్ని తీసుకువచ్చారు. చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు సెట్స్ క్లీన్ చేసిన విజువల్స్ వీడియో లో చూపించారు.
![]() |
![]() |