![]() |
![]() |

యోగాతో మంచి ఫిట్‌గా కనిపించే శిల్పా శెట్టి బిజినెస్‌మ్యాన్ రాజ్ కుంద్రాను 2009లో పెళ్లి చేసుకుంది. 2012 మే 21న తొలిసారి మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తూ వియాన్ అనే కొడుకును ప్రసవించింది. ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఆమె ఏకంగా 32 కిలోల బరువు పెరిగి, బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంది. ఆమె బరువును గేలిచేసింది పురుషులు కాదు, మహిళలే. ఓ సందర్భంలో ఆ విషయాన్ని చెప్పి బాధపడింది శిల్ప. తల్లి సునంద సూచనతో యోగా ద్వారా బరువు తగ్గి, సన్నబడింది.
వియాన్‌ను కన్నాక రెండోసారి తల్లి కావాలని భావించింది శిల్ప. అయితే 'ఏపీఎల్ఏ' అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ కారణంగా ప్రెగ్నెంట్ అయిన ప్రతిసారీ దానితో ఎఫెక్ట్ అయ్యింది. ఫలితంగా రెండు సార్లు ఆమెకు గర్భస్రావాలయ్యాయి. వియాన్ ఒంటరిగా పెరగాలని ఆమె భావించలేదు. శిల్పకు కూడా ఓ చెల్లెలు ఉంది. అందువల్ల తోబుట్టువ విలువ ఏమిటనేది ఆమెకు బాగా తెలుసు. ఏపీఎల్ఏ కారణంగా గర్భస్రావాలవడంతో, ఎవరినైనా దత్తత తీసుకోవాలని రాజ్, శిల్పా అనుకున్నారు. దత్తత కోసం తన పేరును సైతం ఆమె నమోదు చేసుకుంది. అయితే ఆమె సంప్రదిస్తూ వచ్చిన క్రిస్టియన్ మిషనరీ మూతపడటంతో అది నెరవేరలేదు.
నాలుగేళ్ల పాటు రెండో బిడ్డ కోసం ఎదురుచూసిన ఆమె ఫ్రస్ట్రేషన్‌కు గురైంది. అప్పుడు సరోగసీ మార్గంలో బిడ్డను కనాలని శిల్ప దంపతులు నిర్ణయించుకున్నారు. మూడు ప్రయత్నాల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 15న సమీషా పుట్టింది. ఈ మధ్యలో ఒకానొక సందర్భంలో రెండో బిడ్డ ఆలోచనపై ఆశలు కూడా వదిలేసుకుంది శిల్ప. మే 10న మదర్స్ డేని తన చిన్నారి సమీషాతో ఆమె సెలబ్రేట్ చేసుకుంది.

![]() |
![]() |