![]() |
![]() |

ఇటీవల సూపర్‌స్టార్ మహేశ్ ఒక యాడ్ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొనడంతో, 'సర్కారు వారి పాట' డైరెక్టర్ పరశురామ్‌కు ధైర్యం వచ్చింది. తన సినిమా షూటింగ్ షెడ్యూల్‌కు చకచకా ప్లాన్ చేస్తున్నాడు. సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న ఆ సినిమా టైటిల్‌ను ప్రకటించినా, ఇప్పటివరకూ సెట్స్‌పైకి వెళ్లకపోవడానికి కారణం అందరికీ తెలిసిందే.. కొవిడ్ 19 వ్యాప్తి భయం. ఇప్పుడు మహేశ్ షూటింగ్‌కు రెడీ అంటుండటంతో అమెరికాలో షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నాడు పరశురామ్. అక్కడ లొకేషన్లను ఎంపిక చేయడానికి యు.ఎస్. వెళ్లడానికి రెడీ అవుతున్నాడు.
సినిమా కథలో కొంత భాగం యుఎస్ బ్యాక్రడాప్‌లో జరుగుతుంది. అందుకోసం డెట్రాయిట్‌ను ఎంచుకున్నారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని పరిమిత యూనిట్‌తో అక్కడకు వెళ్లి షూటింగ్ చెయ్యాలని భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, నవంబర్‌లో అక్కడ చిత్రీకరణ మొదలు పెడతారు. మహేశ్ జోడీగా కీర్తి సురేశ్ నటించే ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి 'సర్కారు వారి పాట'ను నిర్మిస్తున్నాయి.
![]() |
![]() |