![]() |
![]() |

మాట మార్చిన గంగవ్వ
కట్టప్పగా మొదట్లో అఖిల్ ఇప్పుడు రాజశేఖర్ పేరు చెప్పిన అవ్వ
కట్టప్ప ఎవరూ అన్నది ఇంకా సాగదీస్తారా అంటూ సభ్యుల అసహనం
ఇక గ్రూపులు తయారు అంటూ అమ్మ రాజశేఖర్ పండించిన హాస్యం
నేనే కట్టప్ప జై మహిస్మతి అంటూ ఎమోషనల్ నోయల్ డైలాగ్స్
నిన్న డంబెల్స్ , నేడు బెలూన్ తో గంగవ్వ వర్కవుట్స్
నోయల్ పై ర్యాప్ సాంగ్ పాడిన దివి, దేవి, మొహబూబ్
కట్టప్పగా ఎక్కువ మందితో స్టాంప్ వేయించుకున్న నోయల్, లాస్య
బిగ్ బాాస్ ప్రారంభం నుంచి ప్రతిరోజూ కట్టప్ప అంశం బిగ్ హౌస్ లో ప్రస్తావనకు వస్తూ ప్రేక్షకులతో పాటు హౌస్ లో ఉన్న సభ్యులల్లోనూ క్యూరియాసిటీ కల్పిస్తోంది. శుక్రవారం ప్రసారమైన బిగ్ బాస్ 4 ఎసిసోడ్ 6లోనూ ఇది అంశం కొనసాగింది. ఇంకా సాాగదీస్తారా అంటూ హౌస్ సభ్యులే కామెంట్ చేయడం కొసమెరుపు.
బిగ్ బాస్ సీజన్ జోరందుకున్నట్లు కనిపిస్తుంది. రోజురోజుకీ రేంజ్ పెంచుతూ ప్రేక్షకులను కట్టిపడేసే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్ బాస్. ఎపిసోడ్ 5లో ఇచ్చిన టమాట జ్యూస్ టాస్క్ ను పూర్తి చేయడానికి హౌస్ సభ్యులంతా మూడు గ్రూపులుగా విడిపోయారు. అక్కడున్న బాటిల్లో ఎవరైతే ఎక్కువ టామోటా జ్యాస్ నింపుతారో వాళ్లే గెలిచినట్లు అని బిగ్ బాస్ చెప్పడంతో సభ్యులు బిజిబిజిగా మారారు. బాటిల్స్ తీసుకునే సమయంలో నోయల్, దివి మధ్య పోటీ, సూర్యకిరణ్ కామెంట్స్ ఎపిసోడ్ ప్రారంభంలో కాస్త హుషారు నిచ్చాయి. టాస్క్ పూర్తి కాగానే క్యాలిటీ మేనెజర్ గా వ్యవహరించిన అరియానా క్యాలిటీ లేదంటూ వాటిలో కొన్ని బాటిల్స్ ను రిజక్ట్ చేసింది. గంగవ్వ జ్యూస్ బాటిల్స్ ను పరిశీలిస్తూ ఈ రసం అంతా ఎం చేస్తారో అంటూ కామెంట్ చేసింది. క్యాలిటీ చెక్ పూర్తి అయిన తర్వాత సభ్యులంతా ఒక చోట చేరారు. ఎవరు ఎలా టమాటో జ్యూస్ తీస్తూ కష్టపడ్డారో అమ్మ రాజశేఖర్ ఇమిటేట్ చేస్తూ సభ్యులతో పాటు ప్రేక్షకులను నవ్వించాడు. టాక్స్ రిజల్ట్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటే బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ లో సభ్యులు స్కోర్ ను అనౌన్స్ చేయడానికి రాగానే.. అందరిలో టెన్షన్.. ఎవరికి వాళ్ళు స్కోర్ ఊహించేశారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ టాస్క్ లో 14000 పాయింట్లకు గాను బిగ్ బాస్ ఇచ్చిన స్కోర్ రెండువేలు మాత్రమే. దాంతో సభ్యులంతా నిరుత్సాహ పడ్డారు. గత సీజన్స్ తో పోల్చితే ఈ సీజన్ లో సభ్యుల ఎంపిక సరిగ్గా లేదన్న విమర్శలు వస్తునే ఉన్నాయి. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లోనూ సభ్యులు బాగా వెనకబడిపోతున్నారు.
ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో నాలుగ్గో రోజూ అదిరిపోయే స్టెప్పులు వేశారు బిగ్ హౌస్ సభ్యులు. ఈ రోజు కూడా వర్కవుట్స్ తో ఆకట్టుకుంది గంగవ్వ. నిన్న డంబెల్స్ తో ఈ రోజు బెలూన్ లో వర్కవుట్ చేసింది. మొహబూబ్ ఆమెకు సహాయంగా ఉన్నారు. ఆ తర్వాత జాగింగ్ చేస్తూ రెండు రౌండ్లు పూర్తి చేసింది. అవ్వ నీ వయసేంత అని అడిగిన ప్రశ్నకు 62 ఏళ్లు అని చెప్పింది. నీ వయసు వచ్చేసరికి మేం ఉంటామో అన్నారు ఆమెను గమనిస్తున్న సభ్యులు. వార్కవుట్ పూర్తి చేసిన కూర్చున్న గంగవ్వ ను అరియానా ఇంటర్వ్యూ చేసింది. తన వ్యక్తిగత జీవితంలో పడిన కష్టాలు చెప్పి బిడ్డల కోసం అమ్మ పడే తపనతో ప్రేక్షకుల ముందు సెంటిమెంట్ పండించింది గంగవ్వ. ఇప్పుడు తనకు ఏడుగురు మనుమలు, మనుమరాలు ఉన్నారని చెప్పడంతో వారంతా నిన్ను చూస్తుంటారు అంటూ అరియానా కామెంట్ చేసింది. ఆ తర్వాత సీన్ కిచెన్ లోకి మారింది. మోనాల్ తాను నాన్ వెజ్ తిననని. ఎగ్స్ సెల్స్ అటుఇటూ వేేయకండీ అంటూ ఆమె ఇంగ్లీష్ , హిందీలో చెప్తుంటే కరాటే కళ్యాణి తెలుగులోకి అనువాదం చేశారు. లాస్య, మోనాల్ వంట చేస్తుంటే అక్కడ వచ్చిన కళ్యాణి అలక సీన్ క్రియేట్ చేసింది. ఈ రోజు నేను ఉపవాసం తినను అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. దాంతో అక్కడే ఉన్న సూర్యకిరణ్ ను లాస్య అన్న ఆమె ఎందుకు తినను అంటుంది. మేం చేస్తున్నామా అంది.
కిచెన్లోకి వచ్చిన దివి, అమ్మ రాజశేఖర్ కాసేపు సభ్యులను ఎంటర్ టైన్ చేశారు. తనతో మంచి కథ ఉందని నువ్వు హీరోయిన్, నేను హీరో అన్నాడు. వంటచేసే మగవారంటే తనకు ఇష్టమని దివి చెప్పగానే అమ్మ రాజశేఖర్ తెగఫీలై పోయాడు. ప్రేమావేశంలో మునిగిపోయి నూనెలో టీపోడి వేశాడు. అరె అరె నూనెలో టీ పోడి వేశాను అనగానే అక్కడే ఉన్న సూర్యకిరణ్ గట్టిగా నవ్వుతూ మీ కాంబినేషన్ సెట్ కాలేదు. ఆమె నూనె జాగ్రత్త అంటూ మాడిపోతారు అంటూ కామెంట్ చేయడంతో మరోసారి నవ్వులు. ఇక లంచ్ టైమ్ లో అందరూ డైనింగ్ టైబుల్ పై కూర్చోని ఉండగా చిన్న సర్ ప్రైజ్ అంటూ దివి, దేవి, మొహబూబ్ అక్కడకు వచ్చారు. ర్యాప్ సాంగ్స్ తో ఆకట్టుకునే నోయల్ పై వారు ముగ్గురు ర్యాప్ సాంగ్ పాడుతూ వేసిన స్టెప్పులు సూపర్. మోనాల్ , అభిజిత్, అఖిల్ తో తమ భావాలు పంచుకునే ప్రయత్నం చేశారు. తనకు బ్లూబెర్రీ అంటే చాలా ఇష్టమని చెప్పడంతో అభిజిత్ బిగ్ బాస్ కొన్ని బ్లూబెర్రీలు అంటూ కెమెరా కు చెప్పాడు.
అయితే సీజన్ ప్రారంభమైనప్పటి నుండి ఇంటి సభ్యుల్లో ఓ కట్టప్ప ఉన్నాడు అని ఊరిస్తూ వచ్చిన బిగ్ బాస్ ప్రతి ఎపిసోడ్ లోనూ టాస్క్ ఇచ్చి కట్టప్ప గురించి చర్చ పెడుతున్నాడు. కట్టప్ప ఎవరూ అనేది తేలకపోవడంతో చివరకు బిగ్ బాస్ రంగంలోకి దిగాడు. కొంత మంది సభ్యుల్లో కలిసి ఉన్నట్లే ఉంటూ నమ్మకంగా నటిస్తూ వెన్నుపోటు పొడవడం చాలా చెడ్డ విషయం. అలాంటి వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా మీరు పోడియం వద్ద నిలబడి మీరు ఎవర్ని కట్టప్ప ఆనుకుంటున్నారో, రీజన్ కూడా చెప్పి వాళ్ళ మొఖం మీద స్టాంప్ వేయాలి అని మళ్ళీ ఓ టాస్కు ఇచ్చాడు. బిగ్ బాస్ చెప్పినట్లే ఒక్కొక్కరుగా వెళ్లి ఆ టాస్క్ పూర్తి చేశారు. ఎక్కువ మంది నోయల్, లాస్య మీదనే డౌట్ పడితే నోయల్ మాత్రం కట్టప్ప అంటూ నేను ఎవరి ముఖంపై స్టాంప్ వేసినా వారు బాధపడతారు. అందుకే నేనే కట్టప్ప అనుకుంటున్నాను. నేనే స్టాంప్ వేసుకుంటాను జై మాహిస్మతి అని ఎమోషన్ డైలాగ్స్ చెప్పాడు. అలా వేసుకోవడం కరెక్ట్ కాదు ఇది రూల్స్ కు విరుద్ధం అని ఇంటి సభ్యులు వారిస్తున్నా వినలేదు. బిగ్ బాస్ జోక్యం చేసుకోని అలా చేయడం సరికాదు అని చెప్పడంతో చివరకు రాజశేఖర్ మాస్టర్ ను కట్టప్ప అనుకుంటున్నాను అని అతని కి స్టాంప్ వేసాడు.
గంగవ్వ మొదటి రెండు టాస్క్ ల్లో కట్టప్ప గా అఖిల్ అనుకుంటున్నాను అని చెప్పింది. ఈ రోజు రాజశేఖర్ కట్టప్ప అంటూ స్టాంప్ వేసి సభ్యులతో పాటు ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది. కట్టప్ప టాస్క్ వ్యవహారంలో అటు సభ్యుల్లోనూ.. ఇటు ప్రేక్షకుల్లోనూ క్యూరియాసిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్ బాస్. స్టాంపింగ్ పూర్తి అయిన తర్వాత కట్టప్ప ఎవరన్నది మీకు చెప్పరు. ఆ కట్టప్ప ఎవరన్నది మీకు త్వరలోనే తెలుస్తుంది అని సస్పెన్షన్ లో పెట్టడంతో ఇంకా సాగదీస్తారా అంటూ లాస్య కామెంట్ చేసింది. శని,ఆదివారాల్లో తెలుస్తుంది అంటూ ఇంటి సభ్యులు కామెంట్ చేశారు. దాంతో కట్టప్ప క్యూరియాసిటీ ఈ వీక్ ఎండ్ లో తెరపడుతుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
బిగ్ హౌస్ లో గ్రూప్ లు ఉన్నాయని, మనది మాస్ గ్రూప్ అని రాజశేఖర్ కామెంట్ చేయడం, నాకు ఎందుకు స్టాంప్ వేశారు అంటూ లాస్య తనలో తాను ప్రశ్నించుకుంటుందని ఆమెను ఇమిటేట్ చేశాడు. అక్కడే ఉన్న సూర్యకిరణ, నోయల్, సోహైల్ రాజశేఖర్ యాక్షన్ కు పడిపడి నవ్వారు. అప్పుడే అక్కడికి లాస్య రావడంతో గొంతులో పచ్చివెలక్కాయపడ్డట్లు ఫీల్ అవుతూ.. కాస్త స్టఫ్ ఆఫ్ చేయవా అంటూ ఆమెను అక్కడి నుంచి పంపించాడు. మన అందరిలో ఎక్ ట్రా వారిద్దరూ సోహైల్, అరియానా అంటూ కామెంట్ చేసిన రాజశేఖర్ సోహైల్ అక్కడే ఉన్నాడన్న సోయి రావడంతో పడిపడినవ్వాడు. ఇదేమి అర్థం కాని సోహైల్ ఏమైంది అంటూ ప్రశ్నించడంతో నోయల్, సూర్యకిరణ్ ఫుల్ ఫన్ ఎంజాయ్ చేశారు. మొత్తానికి శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో బిగ్ హౌస్ సభ్యుల జోష్ కాస్త పెరిగినట్టే కనిపిస్తోంది. అయితే ఈ వీకెండ్ ఎపిసోడ్స్ లో కట్టప్ప ఎవరూ అనేది తెలియడంతో పాటు మొదటివారంలో ఎలిమినేట్ ఎవరు అవుతారో స్పష్టం అవుతుంది.
ఎలిమినేషన్ లో ఉన్న ఏడు గురు గంగవ్వ, అభిజిత్, అఖిల్, దివి, సుజాత, సూర్య కిరణ్, మొహబూబ్ లలో ఒకరు హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇప్పటికే వోటింగ్ లో గంగవ్వ, అభిజిత్, దివి ముందుండగా మిగతా నలుగురు ఎలిమినేషన్ కు చేరువగా ఉన్నారు. చివరికి ఇంటిదారి పట్టేది ఎవరూ అనేది బిగ్ బాస్ నిర్ణయిస్తారు.
![]() |
![]() |