![]() |
![]() |

తెలుగు తెరపై హీరోయిన్గా రాణించాలని ప్రయత్నించి, ఆశించిన అవకాశాలు రాకపోవడంతో ఆ ప్రయత్నంలో తొలిమెట్టు దగ్గరే ఆగిపోయిన తెలుగమ్మాయి అర్చనా శాస్త్రి అలియాస్ వేదా శాస్త్రి. ముందుగా ప్రభుదేవా నటించిన 'తపన' సినిమాలో వేద పేరుతో పరిచయమైన ఆమె తర్వాత కాలంలో తిరిగి తన అసలు పేరుకే వచ్చేసింది. అల్లరి నరేశ్ సినిమా 'నేను'లో నాయికగా ఆకట్టుకొని, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను, శ్రీరామదాసు, సామాన్యుడు లాంటి పెద్ద సినిమాల్లో మంచి గుర్తింపు కలిగిన పాత్రలను పోషించినప్పటికీ టాలీవుడ్లో ఆశించినంతగా అర్చనకు చాన్సులు రాలేదు.

హీరోయిన్గా చేసిన 'కమలతో నా ప్రయాణం' సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ ప్రేక్షకాదరణ పొందకపోవడంతో ఆమె అభినయ ప్రతిభ వృథా అయ్యింది. మధ్యలో కన్నడంలో కూడా నాలుగు సినిమాలు చేసింది అర్చన. సుమారు ఐదేళ్లుగా సినిమా చాన్సులు లేకపోవడంతో గత ఏడాది తన బాయ్‌ఫ్రెండ్ జగదీష్‌ను పెళ్లాడి వైవాహిక జీవితంలో స్థిరపడింది. భర్తతో, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో జీవితాన్ని ఆస్వాదిస్తోంది. అందచందాలు, అభినయ సామర్థ్యం ఉన్నప్పటికీ తెలుగు తారలకు టాలీవుడ్లో గత పదేళ్లుగా సరైన ప్రోత్సాహం లేదనేందుకు ఓ ఉదాహరణగా నిలిచింది అర్చన కెరీర్.
.jpg)
![]() |
![]() |