![]() |
![]() |

బాలీవుడ్లో 'కహో నా ప్యార్ హై', టాలీవుడ్లో 'బద్రి'.. 2000వ సంవత్సరంలో అటు హిందీ ప్రేక్షకుల్నీ, ఇటు తెలుగు ప్రేక్షకుల్నీ తన బ్యూటీతో, క్యూట్ పర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేసింది అమీషా పటేల్. హృతిక్ రోషన్‌తో చేసిన 'కహో నా ప్యార్ హై' బ్లాక్‌బస్టర్ కాగా, పవన్ కల్యాణ్ జోడీగా నటించిన 'బద్'రి సూపర్ హిట్టయింది. ఆ తర్వాత టాలీవుడ్లో ఆమె మూడు సినిమాలు.. నాని, నరసింహుడు, పరమవీరచక్ర చేసింది కానీ ఏదీ హిట్ కాలేదు. కానీ బాలీవుడ్లో గదర్: ఏక్ ప్రేమ్ కథ, హమ్రాజ్, భూల్ భులయ్యా వంటి హిట్ సినిమాల్లో నాయికగా నటించి మంచి పేరే తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్గా ఎదిగిందనుకొనేంతలోనే కిందికి పడిపోయింది.
ఇదివరకు ఒక సర్వేలో 'సెక్సియస్ట్ వుమన్ అలైవ్'గా గుర్తింపు పొందిన అమీషా కెరీర్ ఎత్తుపల్లాలతోనే సాగిందని చెప్పాలి. సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితంతోనూ ఆమె వార్తల్లో నిలిచింది. సినిమాల తరహాలోనే ఆమె ప్రేమ జీవితం కూడా ఎత్తుపల్లాలను చవిచూడటం యాదృచ్ఛికమే. అమీషా ఎవరెవరికి తన ప్రేమను పంచిందీ, ఆమె ప్రేమ జీవితంలోని మగవాళ్లెవరో ఓ లుక్ వేస్తే...
విక్రమ్ భట్
.jpg)
మహేశ్ భట్ తమ్ముడైన రైటర్-డైరెక్టర్ విక్రమ్ భట్‌తో ఐదేళ్ల పాటు డేటింగ్ చేసింది అమీషా పటేల్. తమ అనుబంధాన్ని వారు పబ్లిగ్గానే ఒప్పుకున్నారు. ఆ ఇద్దరి అనుబంధం అప్పట్లో బాలీవుడ్లో హాట్ టాపిక్. తర్వాత 2008లో తాము బ్రేకప్ అయినట్లు విక్రమ్ భట్ స్వయంగా ప్రకటించాడు. అమీషా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడం, ఆమె తల్లిదండ్రులతో భట్ ఫ్యామిలీకి గొడవలు జరగడం దీనికి కారణం.
కణవ్ పురి
.jpg)
విక్రమ్ భట్‌తో బ్రేకప్ అయిన ఏడాదే 2008 మార్చిలో లండన్‌కు చెందిన బిజినెస్‌మ్యాన్ కణవ్ పురితో కలిసి దర్శనమిచ్చింది అమీషా. మూడు నెలల తర్వాత తాను కణవ్తో రిలేషన్షిప్లో ఉన్నానని ధ్రువీకరించింది. అయితే రెండేళ్లు గడిచేసరికి వాళ్ల బంధం ముగిసింది. తామిద్దరం విడిపోయామని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది అమీషా.
రణబీర్ కపూర్
.jpg)
ఏంటీ.. రణబీర్ కూడా ఆమె లైఫ్‌లోకి వచ్చాడా? అని ఆశ్చర్యపోతున్నారా! అవును. కణవ్ పురితో బ్రేకప్ తర్వాత ఏడేళ్ల పాటు సింగిల్‌గానే ఉంది అమీషా. 2017లో ఆ ఇద్దరి మధ్యా సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉన్నట్లు బయటకు పొక్కింది. ఎందుకంటే.. ఆ ఏడాది రణబీర్ ఇచ్చిన ప్రైవేట్ బర్త్‌డే పార్టీలో అతని ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా కనిపించిన బయటి వ్యక్తి ఒకే ఒక్కరు. ఆమె అమీషా! ఆ తర్వాత మరో పార్టీలో రణబీర్‌ను పక్కకు తీసుకువెళ్లి ప్రైవేట్‌గా మాట్లాడుతూ కనిపించింది. అప్పటికే తమ గురించి గుసగుసలు వినిపిస్తున్నాయని తెలిసిన రణబీర్.. ఆ పార్టీ నుంచి త్వరత్వరగా బయటకు వెళ్లిపోయాడని దక్కన్ క్రానికల్ రాసుకొచ్చింది. దాని తర్వాత ఆ ఇద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు. ఇప్పుడు అలియా భట్‌తో రణబీర్ సెటిల్ అవబోతున్న విషయం తెలిసిందే.
గత మూడేళ్ల నుంచీ అమీషా లవ్ లైఫ్ గురించి ఎలాంటి సమాచారమూ లేదు. 2018లో 'భయ్యాజీ సూపర్‌హిట్' సినిమాలో సన్నీ డియోల్ సరసన కనిపించిన ఆమె చేతిలో ప్రస్తుతం రెండు మూడు సినిమాలున్నాయి. 45 సంవత్సరాల అమీషా పటేల్ ఇప్పటికీ సింగిలే!!
![]() |
![]() |