![]() |
![]() |

పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న మనుషుల్లోని బలహీనతను ఆసరాగా చేసుకుని రూపొందిన రియాల్టీ షో బిగ్ బాస్. మొదటిసారి హిందీలో 2006లో ఈ షో ప్రారంభమైంది. వయాకామ్ 18, కలర్స్ చానల్స్ ద్వారా ప్రసారమై అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఓటిటి ప్లాట్ ఫారమ్ లోనూ, ఆన్ లైన్ విఓడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనదేశంలో తెలుగు, కన్నడ, మళయాలం, మరాఠీ, బెంగాలీ తదితర ప్రాంతీయభాషల్లో సీజన్స్ గా ప్రసారం అవుతుంది. ప్రారంభంలో సెలబ్రిటీలకు మాత్రమే బిగ్ హౌస్ లోని ఎంట్రీ ఉండగా తరువాత సీజన్లలో కామన్ మెస్ కు కూడా ఎంట్రీ కార్డు ఇచ్చారు. తెలుగులో ఇప్పటివరకు మూడు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ నాల్గో సీజన్ తో స్టార్ మా రేటింగ్ ను పెంచుతోంది. కోట్లాది మంది ప్రేక్షకులు టీవీల ముందు కూర్చోని బిగ్ హౌస్ లోని డ్రామాలను, ఎమోషన్లను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నాల్లో సీజన్ లో బిగ్ బాస్ ను గైడ్ చేస్తున్నది మాత్రం నెటిజన్లే అన్నది స్పష్టంగా తెలుస్తోంది.
ఈ సారి హౌస్ లోకి ఎంట్రీ అయిన 16మంది సభ్యుల్లో సెలబ్రెటీలు చాలా తక్కువ. నిజం చెప్పాలంటే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి తప్ప టెలివిజన్ ప్రేక్షకులకు కొత్తముఖాలు. బిగ్ బాస్ సభ్యుల ఎంపికలోనూ కరోనా ప్రభావం కనిపించింది. పట్టణాల్లో ఉండే ఎక్కువమంది తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే పట్టణం పల్లెకు చేరింది. పల్లె జనాలను ఆకట్టుకునే ప్రయత్నం బిగ్ బాస్ లోనూ కనిపించింది. బిగ్ బాస్ హౌస్ లోని గంగవ్వ అడుగుపెట్టింది. ఆమెకు ఉన్న పల్లె ప్రజల ఫాలోయింగ్ బిగ్ బాస్ వీవర్స్ గా మార్చాలన్న ఎత్తుగడ ఫలించింది.
ఇక గతంలో లేేని విధంగా నైబర్ హౌస్ ను ఏర్పాటుచేసి కొత్తదనం చూపిద్దాం అనుకున్నారు బిగ్ బాస్. అయితే వయసులో ఉన్న యువతీయువకులను ఒక గదిలో బంధించి పాశ్చాత్య సంస్కృతికి, డేటింగ్ కు బిగ్ బాస్ వేదిక అవుతుందన్న విమర్శలు ఎదుర్కొన్నారు. వాటిని సైడ్ చేయడానికి ఫుడ్ లేదన్న డ్రామాతో బిగ్ హౌస్ లోకి సోహైల్, అరియానా ఎంట్రీ ఇచ్చారు. దాంతో బిగి బాస్ షో రిమోట్ ప్రేక్షకుల చేతిలోకి వచ్చింది.
బిగ్ హౌస్ లోని సభ్యులపై నెటిజన్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బిగ్ హౌస్‌లోకి కంటెస్టెంట్ గా వచ్చిన మోడల్ దివి ఎంట్రీ సాంగ్‌లో తన వయ్యారాలతో మన్మధుడు నాగార్జును మైమరపించింది. నెటిజన్లతో పాటు టెలివిజన్ ప్రేక్షకులు ఆమె పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మూడు ఎపిసోడ్స్ లోనూ తమ అంచనాలకు తగ్గట్టు దివి పాత్ర లేకపోవడంతో సోషల్ మీడియాలో దివి మాట్లాడావా అంటూ ట్రోల్ చేశారు. అంతే నాల్గో ఎపిసోడ్ లో దివి నోరు విప్పింది. అందరూ శెభాష్ అనుకునేలా బిగ్ బాస్ ఆమెతో మాట్లాడించాడు. ఏడుపులు ఎక్కువయ్యాయి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ రావడంతో శుక్రవారం ఎపిసోడ్ లో నవ్వులు పండాయి. గంగవ్వకు ఉన్న ఫాలోయింగ్ కారణంగా ఆమె పాత్రకు ప్రాముఖ్యత పెరుగుతోంది. వర్క అవుట్స్, సెటైర్స్ తో ఆమె కెమెరా ముందుకు వస్తున్నారు. వీటన్నింటి బట్టి చూస్తుంటే బిగి బాస్ రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలిసిపోతుంది. ప్రేక్షకులు కోరుకునేదే అందించాలన్న ప్రయత్నం బిగిహౌస్ సభ్యుల ప్రవర్తనలో కనిపిస్తోంది. మొదటివారంలో నామినేషన్లు, కట్టప్ప ఎవరూ అన్న దానిపై నెటిజన్లు, బిగ్ బాస్ అభిమానులు ఇచ్చే కామెంట్స్, చేసే ట్రోలింగ్స్ బట్టే ఉంటాయి. మరి వీకెండ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయో వేచిచూద్దాం.
![]() |
![]() |