![]() |
![]() |

సంజయ్ దత్, పూజా భట్ జంటగా నటించగా బ్లాక్‌బస్టర్ అయిన 'సడక్' సినిమా సీక్వెల్ 'సడక్ 2' విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో దర్శనమివ్వనుంది. అలియా భట్, ఆదిత్యరాయ్ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఆగస్ట్ 28న విడుదలవుతోంది. ఒరిజినల్‌ను డైరెక్ట్ చేసిన మహేశ్ భట్ ఈ మూవీనీ రూపొందించారు. అంతే కాదు.. ఒరిజినల్లో నటించిన సంజయ్ దత్, పూజా భట్ ఈ సినిమాలో కీలక పాత్రలు చేశారు. జిషుసేన్ గుప్తా, మకరంద్ దేశ్‌పాండే కూడా నటించిన ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను గురువారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో అలియా, సంజయ్ దత్, ఆదిత్యరాయ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్లను కెమెరా వెనుక నుంచి చూపిస్తోంది.
'సడక్ 2'కు సంబంధించి రెండు విశేషాలున్నాయి. ఒకటి.. ఒరిజినల్‌ను ఒక కుమార్తెతో తీసిన మహేశ్ భట్, ఈ సీక్వెల్‌ను మరో కుమార్తెతో తీయడం. రెండు.. 20 ఏళ్ల విరామంతో ఆయన ఈ మూవీతో డైరెక్టర్‌గా మనముందుకు వస్తున్నారు. ఊటీ, ముంబై, మైసూర్, ఉత్తరాఖండ్ వంటి లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని మార్చి 25న థియేటర్లలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా విడుదలను వాయిదా వేయక తప్పలేదు. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం కనిపించకపోవడంతో ఓటీటీలో నేరుగా రిలీజ్ చేస్తున్నారు.

![]() |
![]() |