![]() |
![]() |

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న సుహాస్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'కలర్ ఫొటోస. తెలుగమ్మాయి చాందినీ చౌదరి హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా టీజర్ ఆగస్ట్ 5న యూట్యూబ్‌లో రిలీజయింది. కేవలం 12 గంటల్లోనే ఇది ఒక మిలియన్ వ్యూస్ దాటడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ కావడమే దీని ప్రజాదరణకు కారణం. ఒక చిన్న సినిమాకు ఈ స్థాయి రెస్పాన్స్ రావడం పెద్ద విజయంగా భావించాలి.
బుధవారం సాయంత్రం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కలర్ ఫొటో టీజర్‌ను రిలీజ్ చేశాడు. విలన్ తమ జీవితాల్లో అడుగు పెట్టేవరకు హీరో హీరోయిన్ల జీవితం చాలా హాయిగా గడచిపోతుందని తెలుస్తోంది. ఇందులో సునీల్ పోలీస్ ఇన్స్పెక్టర్గా ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. సుహాస్ ఫ్రెండ్‌గా వైవా హర్ష నటించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడు బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. వాస్తవ గాథ ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రొడ్యూసర్ సాయిరాజేశ్ నీలం కథను అందించగా, దర్శకత్వంతో పాటు స్క్రీన్‌ప్లే డైలాగ్స్‌ను సందీప్ రాజ్ సమకూర్చాడు. కాలభైరవ సంగీతం సినిమాకు ప్లస్ అవుతుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. టీజర్లో వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫీ కూడా చూడముచ్చటగా ఉంది.

![]() |
![]() |