![]() |
![]() |

'కొత్త బంగారు లోకం' ఫేమ్ శ్వేతా బసు ప్రసాద్ ఎనిమిది నెలల తరవాత బాలీవుడ్ రాజధాని ముంబై నుండి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆమె గురువారం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళింది. పై నుండి కిందకి పీపీఈ కిట్ తరహాలో డ్రస్పైన రక్షణ కవచం ధరించిన ఆమె ఎయిర్ పోర్ట్‌లో ఫొటోలు దిగింది.
"ఎనిమిది నెలల తరవాత ట్రావెలింగ్ చేస్తున్నాను. ఖాళీ విమానాశ్రయం, మూసివేసిన కేఫ్‌లు, శానిటైజర్ స్ప్రేలు, మాస్కులు ధరించిన ముఖాలు, జాగ్రత్తగా ఒక సీటు విడిచి మరో సీటులో కూర్చోవడం ఎంత విచిత్రంగా అనిపిస్తుందో నేను మీకు చెప్పలేను" అని శ్వేతా బసు ప్రసాద్ పేర్కొన్నారు.

జీ 5 ఓటీటీలో త్వరలో ప్రసారం కానున్న 'కామెడీ కపుల్' షో షూటింగ్ కోసం ముంబై నుండి ఢిల్లీ ట్రావెల్ చేశారు శ్వేతా బసు ప్రసాద్. ఇటీవల డిజిటల్ మీడియాలో వస్తున్న సిరీస్, షోలు ఆమె ఎక్కువ చేస్తున్నారు.
![]() |
![]() |