![]() |
![]() |

ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడానికి ముందు వెనక పదిసార్లు ఆలోచిస్తున్న కాలంలో ఇప్పుడు ప్రపంచమంతా ఉంది. కరోనా వైరస్ ఎక్కడ కాటేస్తుందోనని అవసరమైతే తప్ప ఎవరు బయటకు వెళ్లడం లేదు. ఇటువంటి సమయంలో బ్రిటిష్ మోడల్, తెలుగు తమిళ చిత్రాల్లో కథానాయికగా నటించిన అమీ జాక్సన్ హాలిడేకి వెళ్ళింది. అవును... మీరు చదివింది నిజమే.
అమీ జాక్సన్, ఆమెకు కాబోయే భర్త జార్జ్ పనయోటు ప్రస్తుతం ఇటలీలో ఉన్నారు. పెళ్లికి ముందే ఈ దంపతులు ఇద్దరికీ జన్మించిన బిడ్డ కూడా వారితోనే ఉన్నాడు. ఇది ఫ్యామిలీ ట్రిప్ అన్నమాట. ఇటలీలోని సముద్ర తీర ప్రాంతమైన కేప్రిలో జాలిగా తిరుగుతున్నారు. కరోనా ధాటికి కకావికలమైన దేశాలలో ఇటలీ కూడా ఒకటి. ఒకానొక సమయంలో కొవిడ్ వైరస్ అక్కడ కరతాళ నృత్యం చేసింది. జనాలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పుడు నియంత్రణలోకి వచ్చింది. అందుకని, అమీ ఫ్యామిలీ ధైర్యంగా వెళ్లిన్నట్టుంది.



![]() |
![]() |