![]() |
![]() |

లేట్ బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన లాస్ట్ సినిమా 'దిల్ బేచారా' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం ఏడున్నర గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఈ సినిమా విడుదల కానుంది. సుశాంత్ మరణించిన నేపథ్యంలో సినిమాను క్యాష్ చేసుకోకూడదని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ నిర్ణయించింది. ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్న సభ్యులకు మాత్రమే కాకుండా అందరికీ సినిమా చూసే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఫేమస్ బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఆస్కార్ పురస్కార గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మా వరకు రివ్యూలు జోలికి వెళ్లకూడదని కొంత మంది నటీనటులు విమర్శకులను కోరుతున్నారు. సుశాంత్ కి గౌరవం ఇస్తూ సినిమాలోని పాజిటివ్ అంశాలను మాత్రమే మాట్లాడాలని వారు పేర్కొంటున్నారు.

![]() |
![]() |