![]() |
![]() |

వరుణ్‌తేజ్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి రూపొందిస్తోన్న సినిమా షూటింగ్ ఆగస్ట్ నుంచి కొనసాగించడానికి ప్రొడ్యూసర్లు ప్లాన్ చేస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా తయారవుతున్న ఈ మూవీలో వరుణ్ సరసన మహేశ్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ నాయికగా నటిస్తోంది. అల్లు వెంకటేశ్ (అల్లు అరవింద్ పెద్ద కుమారుడు), సిద్ధు ముద్ద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇంకా టైటిల్ ఖాయం కాని ఈ సినిమాలో తాజా సమాచారం ప్రకారం కన్నడ స్టార్ యాక్టర్ ఉపేంద్ర ఒక కీలకమైన క్యారెక్టర్ చేయనున్నాడు. ఆగస్ట్‌లో సెట్స్ మీదకు రావడానికి ఓకే చెప్పాడు. తెలుగు ప్రేక్షకుల్లోనూ అభిమానులున్న కన్నడ నటుల్లో ఉపేంద్ర ఒకరనే విషయం మనకు తెలుసు. 'ఏ', 'రా', 'కన్యాదానంస', 'ఓం' వంటి చిత్రాల్లో హీరోగా నటించడం ద్వారా ఆయన ఇక్కడ కూడా పాపులర్. చివరిసారిగా ఆయన అల్లు అర్జున్ సినిమా 'సన్నాఫ్ సత్యమూర్తిలో' కనిపించాడు.
వరుణ్ సినిమాలో ఒక పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందనీ, ఆడియెన్స్‌లో మంచి ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ చేస్తేనే ఆ క్యారెక్టర్‌కు న్యాయం జరుగుతుందని డైరెక్టర్ భావించాడు. కథ, తనకు ఆఫర్ చేసిన పాత్ర నచ్చడంతో ఉపేంద్ర అంగీకరించాడు. నవంబర్‌లోగా షూటింగ్ పూర్తిచేసి డిసెంబర్ లేదా 2021 మొదట్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
![]() |
![]() |