![]() |
![]() |

క్రిష్ జాగర్లమూడి... ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా చారిత్రక, జానపద నేపథ్యంలో రాబిన్ హుడ్ టైప్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తరవాత పవన్ కళ్యాణ్‌తో దర్శకుడు హరీష్ శంకర్ ఓ సినిమా చేయనున్నారు. అంతకు ముందు పవన్‌తో అతడు 'గబ్బర్ సింగ్' చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ హీరోగా సినిమాలు చేస్తున్న ఈ ఇద్దరు దర్శకులు కలిసి, ఓ సినిమా చేయనున్నారు. అదీ నిర్మాతలుగా!
ఓ వైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూ... మరోవైపు నిర్మాతగా సీరియళ్లు, వెబ్ సిరీస్, సినిమాలు తీయడం క్రిష్ జాగర్లమూడికి అలవాటు. ఇటీవల హరీష్ శంకర్ నిర్మాతగా మారారు. మహేష్ కోనేరుతో కలిసి ఒక సినిమా ప్రకటించారు. ఇప్పుడు క్రిష్ నిర్మాణ భాగస్వామ్యంలో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హీరో, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా ఖరారు కాలేదు. కానీ, కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ సినిమా చేయాలని క్రిష్, హరీష్ డిసైడ్ అయ్యారట. ఓటీటీ కోసం వెబ్ సిరీస్, షోలు నిర్మించే ఆలోచనలో ఇద్దరూ ఉన్నారట.
![]() |
![]() |