![]() |
![]() |

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. దివంగత కథానాయకుడితో సంబంధం కలిగిన వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కి పిలుస్తున్నారు. అతడి జీవితంలో ఏం జరిగిందో తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ముంబైలోని బంద్రా పోలీస్ స్టేషన్‌కి వెళ్లొచ్చారు. ఇంటరాగేషన్ నిమిత్తం ఆమెను పిలిచిన పోలీసులు కొంతసేపు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడనే కోణంలో విచారించారని ముంబై ఖబర్.
సుశాంత్, రియా చక్రవర్తి కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. అంకిత లోఖండేతో ఆరేళ్లు సహా జీవనం చేసిన సుశాంత్, ఆ తర్వాత కృతి సనన్ తో ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. కానీ, ఇద్దరూ వాటిని కన్ఫర్మ్ చేయలేదు. రియా చక్రవర్తి విషయంలో అయితే ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్టు ప్రాపెర్టీ మేనేజర్ ఒకరు వెల్లడించారు.
ఆల్రెడీ రియా చక్రవర్తిని విచారించిన పోలీసులు, కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రాను విచారించడానికి రెడీ అవుతున్నారు. అతడికి పోలీస్ స్టేషన్‌కి రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారట. సుశాంత్, ముఖేష్ క్లోజ్ ఫ్రెండ్స్. ఈ కేసులో బాలీవుడ్ పెద్దలు సైతం విచారణ ఎదుర్కొనాల్సి రావచ్చని సమాచారం.
![]() |
![]() |