![]() |
![]() |

చిరంజీవి అంటే టాలీవుడ్ మెగాస్టార్ కాదు... యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, ఇటీవల హఠాన్మరణం చెందిన కన్నడ కథానాయకుడు చిరంజీవి సర్జా తెలుసు కదా! అతడి భార్య, కథానాయిక మేఘనారాజ్ ప్రస్తుతం గర్భవతి. భర్త ఆకస్మిక మరణంతో కన్నీరుమున్నీరవుతున్న ఆమె... గురువారం సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. అందులో తాను గర్భవతిని అనే సంగతి స్పష్టం చేశారు.
చిరంజీవి సర్జా గుర్తొస్తున్న ప్రతిక్షణం... తాను మరణిస్తున్నట్లు ఉందనీ, అంతులేని నరక యాతన అనుభవిస్తున్నాననీ మేఘనారాజ్ పేర్కొన్నారు. నన్ను ఎంతగానో ప్రేమించి, ఎప్పటికీ వదలనంటూ మాట ఇచ్చిన భర్త... మాట నిలబెట్టుకోలేకుండా వెళ్ళిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ ప్రేమకు గుర్తుగా తనకొక చిన్నారిని ఇస్తున్నందుకు భర్తకు ఎప్పటికీ కృతజ్ఞురాలిగా ఉంటానని మేఘనారాజ్ తెలిపారు. త్వరలో జన్మించబోయే బిడ్డలో భర్తను చూసుకుంటాననీ, బిడ్డ రూపంలో మళ్లీ భర్తను భూమిపై తీసుకొచ్చేందుకు తహతహలాడుతున్నాననీ ఆమె భావోద్వేగంతో పోస్టులు రాసుకొచ్చారు. తన ఊపిరి ఆగిపోయే వరకు భర్త బ్రతికే ఉంటాడని, తనలోనే భర్త ఉన్నాడని మేఘనారాజ్ అన్నారు.
![]() |
![]() |