![]() |
![]() |

పరిణీతి చోప్రా.. చూడ్డానికి మెతకమ్మాయి లాగా అనిపిస్తుంది కానీ, జీవితం గురించి చాలా లోతుగా ఆలోచించి మాట్లాడే వివేకం ఆమెలో ఉంది. అందుకే ఒకవైపు మహమ్మారి కారణంగా అనేకమంది ఉపాధి కరువై అన్నమో రామచంద్రా అని అల్లాడుతుంటే, ఇంకోవైపు వర్కవుట్ వీడియోలు పెట్టేవాళ్లను ఆమె విమర్శిస్తోంది. ఇటీవల ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లాక్‌డౌన్ కాలంలో తాను తెలుసుకున్న విషయాల గురించి ఆమె చెప్పుకొచ్చింది.
"నేను అంబాలా నుంచి వచ్చాను. అక్కడ జనాలకు మనలాగా 24 గంటల పాటు ఎలక్ట్రిసిటీ, ఏసీ రూములు, వాటర్, గ్యాస్, వై-ఫై లాంటివి ఉండవు. అంబాలా చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితి ఉందో నేను చెప్పలేను. అక్కడి జనం దినసరి వేతనంతో పనిచేసేవాళ్లు కావడంతో నిజంగా దారుణ పరిస్థితుల్లో ఉన్నారు. మన బ్యాంక్ అకౌంటుల్లో తగినంత డబ్బుంది కాబట్టి మరో ఆరు నెలల పాటు ఇబ్బంది లేకుండా మనం గడపగలం. మన సేవింగ్స్ నుంచి మనం తింటున్నాం. మనుగడ కోసం మనం పోరాటం చేయడం లేదు. సెల్ఫీలు పెట్టి నాకు బోర్‌గా ఉంది. ఏం చెయ్యాలో తోచడం లేదు అంటూ చెప్పేవాళ్లను చూస్తుంటే నాకు కంపరంగా ఉంటుంది. వర్కవుట్ వీడియోలు పోస్ట్ చెయ్యడం ఆపమని యాక్టర్లకు సూచిస్తూ ఫరా ఖాన్ రిలీజ్ చేసిన వీడియో నాకు నచ్చింది. నేను ఒంటరిగా గడుపుతున్నాను. నా స్టాఫ్ అంతా వెళ్లిపోయారు. ఇంటి పనంతా నేనే చేసుకుంటున్నా. అయినా నేనెవరి మీదా కంప్లయింట్ చేయడం లేదు" అని తెలిపింది పరిణీతి.
ఆమె నటించిన, నటిస్తోన్న సందీప్ ఔర్ పింకీ ఫరార్, ద గాళ్ ఆన్ ద ట్రైన్, సైనా సినిమాలు ఒక దాని వెంట ఒకటిగా రిలీజవడానికి సిద్ధమవుతున్నాయి.
![]() |
![]() |