![]() |
![]() |

బాబాయ్ వెంకటేష్, తాను కలిసి ఒక ప్రాజెక్టు చేయబోతున్నామని అబ్బాయ్ రానా దగ్గుబాటి ఇటీవల ప్రకటించాడు. అయితే, అది సినిమా కాదు... ఒక వెబ్ సిరీస్. అవును... బాబాయ్-అబ్బాయ్ కలిసి ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నారని ఫిలింనగర్ టాక్. దీనికి బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నారని, పాన్ ఇండియా లెవల్ లో చేస్తున్నారని సమాచారం.
విక్టరీ వెంకటేష్‌కి కొన్నాళ్ల నుండి వెబ్ సిరీస్ చేయాలని ఉందట. అయితే, కేవలం తెలుగుకి మాత్రమే టార్గెట్ చేసేలా కాకుండా, భారతీయ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని అనుకున్నారట. అటువంటి స్క్రిప్ట్ వచ్చేసరికి రానాతో కలిసి నటించడానికి వెంటనే ఒకే చెప్పేశారని తెలిసింది. ఆల్రెడీ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందట. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.
ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' సినిమా చేస్తున్నారు వెంకటేష్. వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాట పర్వం' చేస్తున్నారు రానా. అలాగే, 'అయ్యప్పనుమ్ కోషియుమ్' కూడా చర్చల్లో ఉంది. మధ్యలో వెబ్ సిరీస్ కూడా యాడ్ అవ్వచ్చు. ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులు చేయడం రానాకు అలవాటే.
![]() |
![]() |