![]() |
![]() |
.webp)
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప: ది రైజ్'లో 'ఊ అంటావా మావా' అంటూ సమంత అలరించిన సంగతి తెలిసిందే. సమంత తన కెరీర్ లో చేసిన మొదటి స్పెషల్ సాంగ్ ఇదే. ఈ సాంగ్ కి నేషనల్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సాంగ్ కారణంగా ఆడియన్స్ తన గత సినిమాలను, గత పెర్ఫార్మన్స్ లను మర్చిపోయారంటూ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
'ఏ మాయ చేశావే' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సమంత తక్కువకాలంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇటీవల 'ది ఫ్యామిలీ మ్యాన్-2' సిరీస్ తో హిందీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 'శాకుంతలం', 'యశోద' వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న సమంత తాజాగా 'ఊ అంటావా' సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
తాజాగా క్రిటిక్స్ చాయిస్ అవార్డుల ఫంక్షన్ కు సమంత హాజరైంది. ఈ సందర్భంగా యాంకర్ 'ఊ అంటావా' సాంగ్ గురించి ప్రస్తావించగా.. 'ఊ అంటావా' సాంగ్ కి ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుందని ఊహించలేదని సమంత తెలిపింది. ఇది తెలుగు సాంగ్ అయినా కూడా పాన్ ఇండియా లెవల్ లో హిట్టయిందని సంతోషం వ్యక్తం చేసింది. జనాలు అంతకుముందు తాను చేసిన సినిమాలన్నీ మర్చిపోయి, ఊ అంటావా మావా సాంగ్ లో చాలా బాగా చేశానని ప్రశంసిస్తున్నారు అంటూ సమంత చెప్పుకొచ్చింది.
![]() |
![]() |