![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ కెప్టెన్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్. యాక్షన్ సాగాగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ కి జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సలార్ కి సంబంధించి ఆసక్తికరమైన అప్ డేట్స్ చెప్పుకొచ్చారు దర్శకుడు ప్రశాంత్. సలార్ ఒరిజినల్ కంటెంట్ తోనే తెరకెక్కుతున్న సినిమా అని.. తన ఫస్ట్ ఫిల్మ్ ఉగ్రంకి కానీ, మరే బాలీవుడ్, హాలీవుడ్ సినిమాకి కానీ ఇది రీమేక్ వెర్షన్ కాదని ప్రశాంత్ వెల్లడించారు. అలాగే సెప్టెంబర్ - అక్టోబర్ సమయానికి సలార్ కి సంబంధించిన షూటింగ్ పూర్తవుతుందని చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. 2022 సంక్రాంతికి సలార్ ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ప్రశాంత్ తెలిపారు.
కాగా, కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హొంబళే ఫిల్మ్స్ సలార్ ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.
![]() |
![]() |