![]() |
![]() |

`కొత్త బంగారు లోకం` చిత్రంలో స్వప్నగా ఆకట్టుకుని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది శ్వేతాబసూ ప్రసాద్. తొలి చిత్రంతోనే మంచి పాపులారిటీని దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఆ తరువాత చేసిన చిత్రాలు, ఎంచుకున్న పాత్రలు ఆమె కెరీర్‌కి అంతగా ఉపయోగపడలేదు. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు ఆమె కెరీర్‌ని మరింత ప్రశ్నార్థకంలో పడేశాయి.
2018లో రోహిత్ మిట్టల్ అనే దర్శకుడిని ప్రేమించి పెళ్లాడింది. పెళ్లికి ముందు మంచి మిత్రులైన వీరిద్దరు పెళ్లైన ఎనిమిది నెలలకే విడిపోయి షాకిచ్చారు. గత కొంత కాలంగా ఒంటరి జీవితాన్నే అనుభవిస్తున్న శ్వేతా బసూ ప్రసాద్ తాజాగా తన వివాహ బంధంపై స్పందించింది. పరస్పర అంగీకారంతోనే ఇద్దరం విడిపోయామని, అయితే అది ఓ బ్రేకప్‌లానే వుందని చెప్పుకొచ్చింది.
"కొన్ని కారణాలతో మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది. వివాహం జరిగిన తరువాత చాలా మంది తమ బంధానికి ముగింపు పలకడం మనం చూస్తూనే వున్నాం. కానీ మేము మాత్రం కేవలం ఎనిమిది నెలల్లోనే విడిపోవాల్సి వచ్చింది. కాబట్టి దాన్ని విడాకులనే పెద్ద పదంతో పోల్చడం కంటే ఇది ఓ బ్రేకప్‌లా అనిపిస్తోంది. రోహిత్‌కు దూరమైన సమయంలో ఎంతో బాధపడ్డాను. ఆ సమయంలో నాకు నేను స్నేహితురాలిగా మారాను." అని తెలిపింది శ్వేత.
![]() |
![]() |