![]() |
![]() |
.jpg)
ఈ ఏడాది.. మెగాకాంపౌండ్ హీరోలకు ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఏప్రిల్ తో మొదలుకుని అక్టోబర్ వరకు ప్రతీ నెలలోనూ ఈ క్యాంప్ నుంచి సినిమాలు సందడి చేయనున్నాయి. ఆ చిత్రాల వివరాల్లోకి వెళితే..
ఏప్రిల్: ఈ నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రి-ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ రిలీజ్ కానుంది. ఏప్రిల్ 9న ఈ కోర్ట్ డ్రామా థియేటర్స్ లో సందడి చేయనుంది.
మే: మేలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ డ్రామా ఆచార్య విడుదల కానుంది. మే 13న జనం ముందుకు రానున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నారు.
జూన్: ఈ నెలలో సుప్రీమ్ హీరో సాయితేజ్ నటించిన రిపబ్లిక్ రిలీజ్ కానుంది. జూన్ 4న ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది.
జూలై: మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా గని.. జూలై 30న విడుదల కానుంది. ఇందులో వరుణ్ బాక్సర్ రోల్ లో దర్శనమివ్వనున్నారు.
ఆగస్టు: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా మూవీ పుష్ప.. ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఇదే నెలలో విక్టరీ వెంకటేశ్ తో వరుణ్ తేజ్ నటిస్తున్న ఎఫ్ 3 కూడా ఆగస్టు 27న రాబోతోంది.
సెప్టెంబర్: ఈ నెలలో దగ్గుబాటి స్టార్ రానాతో కలసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మల్టిస్టారర్ (అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్) రిలీజ్ కానుంది.
అక్టోబర్: అక్టోబర్ 13న యంగ్ టైగర్ యన్టీఆర్ తో కలసి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మల్టిస్టారర్ ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కానుంది.
మరి.. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అంటే ఏడు నెలల పాటు సందడి చేయనున్న ఈ 8 మెగా కాంపౌండ్ సినిమాల్లో వేటికి ప్రజాదరణ దక్కుతుందో చూడాలి.
![]() |
![]() |