![]() |
![]() |

2021 సంక్రాంతి బ్లాక్ బస్టర్ క్రాక్ తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఒకవైపు ఆ విజయాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సన్నాహాలు చేసుకుంటున్నాడు. గత చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో చేసిన గోపీచంద్.. కొత్త సినిమాని నటసింహ నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ క్రేజీ వెంచర్ ని.. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణని మహానటుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే 28న ప్రారంభించేందుకు గోపీచంద్ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
కాగా, అదే మే 28న బాలయ్య ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ BB3 (వర్కింగ్ టైటిల్) రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దీనికి మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు.
మొత్తమ్మీద.. తన తండ్రి యన్టీఆర్ జయంతికి ఒక సినిమాని థియేటర్స్ లోకి, మరో సినిమాకి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారన్నమాట బాలయ్య.
![]() |
![]() |