![]() |
![]() |

గ్యాప్ వచ్చినా, తీసుకున్నా.. కొందరికి ఆ గ్యాప్ ప్లస్ అవుతుంది. మరికొందరికి మైనస్ అవుతుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సంగతే తీసుకుంటే.. కథానాయకుడిగా తెరంగేట్రం చేసినప్పటి నుంచి ఏడాదికి ఒకట్రెండు సినిమాలతో పలకరించే తనకి 2008, 2009 సంవత్సరాల్లో వచ్చిన గ్యాప్ అనేది మైనస్ అయిందనే చెప్పాలి. అలా స్వల్ప విరామం తరువాత మహేశ్ నుంచి వచ్చిన ఖలేజా (2010) బాక్సాఫీస్ వద్ద నిరాశజనక ఫలితం అందుకోవడమే ఇందుకు నిదర్శనం. కట్ చేస్తే.. ఇప్పుడు మరోసారి గ్యాప్ తీసుకుంటున్నారు ఈ ఘట్టమనేని హ్యాండ్సమ్ హీరో.
కెరీర్ లో తొలిసారి రెండేళ్ళ పాటు వచ్చిన గ్యాప్ తరువాత 2010 నుంచి 2020 వరకు ప్రతీ క్యాలెండర్ ఇయర్ లోనూ వినోదాలు పంచిన మహేశ్.. 2021ని మళ్ళీ జీరో రిలీజ్ ఇయర్ గా సరిపెడుతున్నారు. ఈ గ్యాప్ తరువాత సర్కారు వారి పాటతో పలకరించబోతున్నారు. 2022 సంక్రాంతికి ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది. మరి.. తొలిసారి వచ్చిన గ్యాప్ మహేశ్ కి మైనస్ గా మారిన నేపథ్యంలో.. సెకండ్ టైమ్ వస్తున్న గ్యాప్ అయినా ప్లస్ అవుతుందేమో చూడాలి.
![]() |
![]() |