![]() |
![]() |

బిగ్‌బాస్ సీజన్ 4లో లేడీ ఆటమ్ బాంబ్ అరియానా.. ఇస్మార్ట్ సోహైల్ మధ్య జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఓ దశలో ఇద్దరి మద్య గొడవ తారా స్థాయికి చేరింది. బిగ్‌బాస్ హౌస్ మైకులు పగిలిపోయే స్థాయిలో ఇద్దరి మధ్య పతాక స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. అదే తనని ఫైనల్ నుంచి నిష్క్రమించేలా చేస్తుందని ఆ తరువాత సోహైల్ భయపడి బిగ్‌బాస్ ముందు క్షమాపణలు కూడా కోరాడు.
ఒక దశలో ఇద్దరి మధ్య సఖ్యత కుదిరిందని అనుకున్నా ఆ తరువాత కూడా ఇద్దరి మధ్య సఖ్యత అసలు కనిపించలేదు. తాజాగా ఈ ఇద్దరు కలిసి బిగ్‌బాస్ ఉత్సవంలో మళ్లీ రచ్చ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఆదివారం బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లతో `బిగ్‌బాస్ ఉత్సవం` పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రొమో గత మూడు నాలుగు రోజులుగా `స్టార్ మా`లో సందడి చేస్తోంది.
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అరియానా ఎక్కడెక్కడో సోహైల్‌పై చేతులేస్తూ రచ్చ చేసింది. శ్రీముఖి పక్కనుండగానే తన హృదయంపై అరియానా చేతులేసి మృదువుగా తాకడంతో సోహైల్‌కు ఏదేదో అయిపోయి ఒంట్లో కరెంట్ పాసైపోయింది. దీంతో ఏదో జరిగేలా వుందని భావించిన సోహైల్ `అరేయ్ మెహబూబ్.. అఖిల్..` అంటూ కేకలు వేశాడు. దీంతో శ్రీముఖి అందుకుని అరియాన చేయివేస్తే `మెహబూబ్.. అఖిల్.. ఏంటయ్యా.. అంటూ సోహైల్ గాలి తీసేసింది.
![]() |
![]() |