![]() |
![]() |

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చాడు. దాదాపు ఏడు నెలల విరామం అనంతరం కొత్త సినిమా షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సాయి తేజ్ పై పూల వర్షం కురిపిస్తూ చిత్ర యూనిట్ గ్రాండ్ వెల్‌కమ్ పలికింది. దీంతో సాయి తేజ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.
గతేడాది సెప్టెంబర్ లో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తన స్పోర్ట్స్ బైక్ పై కెబుల్ బ్రిడ్డ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. స్కిడ్ అయి పడిపోయాడు. కొన్ని రోజుల చికిత్స తీసుకొని ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న సాయి తేజ్ విశ్రాంతి అనంతరం ఆరేడు నెలల తర్వాత మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు.

సాయి తేజ్ హీరోగా నటిస్తున్న 15 వ సినిమా షూటింగ్ షురూ అయింది. ఈ సినిమాకు కార్తీక్ దండు అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు(మార్చి 29) నుంచి మొదలైంది. సెట్ లో అడుగుపెట్టిన సాయి తేజ్ కి దర్శకనిర్మాతలతో పాటు ఇతర మూవీ టీమ్ ఘన స్వాగతం పలికారు. సాయి తేజ్ రీఎంట్రీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
![]() |
![]() |