![]() |
![]() |

``ఊ అంటావా మామా.. ఊహు అంటావా మామా`` అంటూ `పుష్ప - ద రైజ్`లో చెన్నై పొన్ను సమంత ఆడిపాడిన ప్రత్యేక గీతం ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ సామ్ చేసిన ఈ ఐటమ్ సాంగ్.. తనకి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది.
ఇదిలా ఉంటే, `పుష్ప - ద రైజ్`లో స్పెషల్ సాంగ్ చేసిన సమంత.. ఆ చిత్రం సెకండ్ పార్ట్ `పుష్ప - ద రూల్`లోనూ ఎంటర్టైన్ చేయనుందట. అయితే, ఈ సారి పాటలో కాకుండా ఓ స్పెషల్ రోల్ లో దర్శనమివ్వనుందట సామ్. అంతేకాదు.. పాత్ర నిడివి తక్కువే అయినా.. చాలా ప్రభావవంతంగా ఉంటుందని సమాచారం. అలాగే, ``ఊ అంటావా మామా`` పాటతో కనెక్షన్ ఉండేలానే ఈ క్యారెక్టర్ ని సుక్కు డిజైన్ చేశారని బజ్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - నేషనల్ క్రష్ రష్మికా మందన్న జంటగా కొనసాగనున్న `పుష్ప - ద రూల్`లో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్న ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ సెకండ్ పార్ట్.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
![]() |
![]() |