![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ సరసన కనువిందు చేసిన కథానాయికల్లో కన్నడ కస్తూరి నభా నటేశ్ ఒకరు. 2020 ఆరంభంలో విడుదలైన `డిస్కో రాజా` చిత్రంలో ఈ ఇద్దరు జంటగా ఎంటర్టైన్ చేశారు. కట్ చేస్తే.. త్వరలో రవితేజ, నభా మరోసారి కలిసి నటించబోతున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `నేను లోకల్` ఫేమ్ త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. `ధమాకా` పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇందులో రవితేజకి జంటగా `పెళ్ళి సందడి` ఫేమ్ శ్రీ లీల నటిస్తోంది. కాగా, మరో కథానాయిక పాత్రకు కూడా ఈ చిత్రంలో స్థానముందట. ఆ వేషంలో నభా నటేశ్ దర్శనమివ్వనుందని బజ్. త్వరలోనే `ధమాకా`లో నభా ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. `డిస్కో రాజా`తో హిట్ కొట్టలేకపోయిన రవితేజ, నభా నటేశ్ జోడీ.. `ధమాకా`తోనైనా సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే, రవితేజ తాజా చిత్రం `రామారావు ఆన్ డ్యూటీ` జూన్ 17న రిలీజ్ కానుంది. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్ నాయికలుగా నటించారు.
![]() |
![]() |